Talakondapally: సత్యమ్మ కుటుంబానికి పడకల్ సర్పంచ్ ఆర్థిక సాయం
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన గాజులపల్లి సత్యమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం అందించారు.
Talakondapally: సత్యమ్మ కుటుంబానికి పడకల్ సర్పంచ్ ఆర్థిక సాయం
రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన గాజులపల్లి సత్యమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబాన్ని శుక్రవారం పడకల్ సర్పంచ్ డోకూరు సునీత ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు.
కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.4,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా డోకూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మృతురాలి కుటుంబానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎండీ వాజిత్, బి. నరసింహ, బి. రమేష్, తుళ్ల తిరుపతిగౌడ్, బండగళ్ల రామస్వామి, బత్తుల లక్ష్మీనారాయణ, ఎండీ బషీర్, ఎండీ గౌస్, సత్తయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.




