Talakondapally: తలకొండపల్లి బీజేపీ అధ్యక్షుడిగా నీలకంఠ పాండు ఎన్నిక

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల బీజేపీ నూతన అధ్యక్షుడిగా నీలకంఠ పాండు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కండువా కప్పి ప్రకటించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Sept 2026 7:00 PM IST
Talakondapally
X

Talakondapally: తలకొండపల్లి బీజేపీ అధ్యక్షుడిగా నీలకంఠ పాండు ఎన్నిక

రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండల భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షుడిగా నీలకంఠ పాండు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు..

జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నర్సింహ ఆధ్వర్యంలో నీలకంఠ పాండుకు బీజేపీ కండువా కప్పి మండల అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించారు. అనంతరం నూతన అధ్యక్షుడిని పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నీలకంఠ పాండు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన తల్లోజు ఆచారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీని మండలంలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చెక్కల లక్ష్మణ్, మాజీ మండల అధ్యక్షుడు రవి గౌడ్, వెంకట్రావుపేట సర్పంచ్ ఈ. మహేష్, పోతుగంటి మహేష్, వెంకటేష్, శ్రీశైలం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన మండల అధ్యక్షుడు నీలకంఠ పాండుకు అభినందనలు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY