Talakondapally: బీజేపీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నీలకంఠ పాండు

Talakondapally: తలకొండపల్లి బీజేపీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నీలకంఠ పాండు. తల్లోజు ఆచారి ఆశీర్వాదాలు తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటన.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Sept 2026 9:33 PM IST
Talakondapally
X

Talakondapally: బీజేపీ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నీలకంఠ పాండు

తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం భారతీయ జనతా పార్టీ తలకొండపల్లి మండల అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన నీలకంఠ పాండు పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ నేత తల్లోజు ఆచారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నీలకంఠ పాండు మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తల్లోజు ఆచారి ఆశీర్వాదం, పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో తలకొండపల్లి మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నర్సింహ, జిల్లా కౌన్సిల్ సభ్యులు చెక్కల లక్ష్మణ్, అనిల్, పడకల్ ఉపసర్పంచ్ రాఘవేందర్, భగీరథ, బోల్ శ్రీను, ఈసరి శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY