Pargi: రావులపల్లిలో 18 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామంలో శిరీష (18) అనే యువతి బావిలో శవమై తేలింది.ప్రేమ పేరుతో వేధింపుల వల్లే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

WAZID, PARIGI
Published on: 10 Oct 2026 11:34 AM IST
Pargi
X

Pargi: రావులపల్లిలో 18 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామంలో 18 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. గ్రామ శివారులోని ఓ బావిలో శిరీష అనే యువతి మృతదేహం లభ్యమైంది.

ప్రేమ పేరుతో వేధింపులే కారణమా?కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చరణ్ అనే యువకుడు శిరీషకు ఫోన్ చేస్తూ వేధించేవాడని ఆరోపిస్తున్నారు. ఘటనకు ముందు రోజు సాయంత్రం నుంచి బయటకు రావాలని యువతికి పదేపదే ఫోన్ చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.శిరీష ముఖంపై రక్తగాయాలు ఉండటంతో తమ కుమార్తెను హత్య చేసి బావిలో పడేశారని ఆమె తల్లి ఆరోపిస్తున్నారు. అయితే యువతి మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.

సమాచారం అందుకున్న పోలీసులు బావిలో నుంచి శిరీష మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి చరణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

యువతి మృతికి ఆత్మహత్య కారణమా? లేక మరేదైనా జరిగిందా? ముఖంపై ఉన్న గాయాలు ఎలా ఏర్పడ్డాయి? అనే అంశాలపై పోలీసుల దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.రావులపల్లి గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపగా.. శిరీష మృతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికితీయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI