Vikarabad: వికారాబాద్ గాంధీ పార్కులో బాలుడి కిడ్నాప్‌కు యత్నం?

Vikarabad: వికారాబాద్ గాంధీ పార్కులో బాలుడి కిడ్నాప్‌కు యత్నించారన్న అనుమానంతో స్థానికులు కొందరు వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 23 Nov 2026 2:42 PM IST
Vikarabad
X

Vikarabad: వికారాబాద్ గాంధీ పార్కులో బాలుడి కిడ్నాప్‌కు యత్నం?

వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో ఆడుకుంటున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనతో పార్కు పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో అప్రమత్తమైన స్థానికులు సదరు వ్యక్తులను పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. పట్టుబడిన వ్యక్తులు ఇతర రాష్ట్రానికి చెందినవారిగా స్థానికులు అనుమానిస్తున్నట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అసలు బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారా? పట్టుబడిన వ్యక్తులు ఎవరు? ఈ ఘటన వెనుక కారణాలేమిటి? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

అయితే ఈ ఘటనపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD