Huzurnagar: హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
Huzurnagar: సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ హుజూర్‌నగర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలు, వసతులపై సమీక్షించారు.
Huzurnagar: హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
హుజూర్‌నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్య సేవలు, వివిధ విభాగాల పనితీరు, రోగులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
అనంతరం డీసీహెచ్‌ఎస్ వెంకటేశ్వర్లు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బందితో సమావేశమై ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వసతులు, వైద్య సేవల నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై చర్చించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు.




