Talakondapally: క్రీడలు యువతలో క్రమశిక్షణను పెంపొందిస్తాయి!
Talakondapally: తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాలో వాలీబాల్ టోర్నమెంట్‌కు రూ.10వేల సాయం అందించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ.
Talakondapally: క్రీడలు యువతలో క్రమశిక్షణను పెంపొందిస్తాయి!
Talakondapally: తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాలో పర్యటించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు & TASK C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వాలీబాల్ టోర్నమెంట్‌కు హాజరై క్రీడాకారులను అభినందించారు.. టోర్నమెంట్ నిర్వహణకు రూ.10,000/- ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ యువతలో ఎంతో ప్రతిభ దాగి ఉందని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. యువత క్రీడలు, విద్యపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం తండా ప్రజలతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్న ఆయన, తాగునీటి సమస్య పరిష్కారానికి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువత ప్రోత్సాహం, ప్రజారోగ్య పరిరక్షణ, గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు..
టోర్నమెంట్ నిర్వాహకులు క్రీడలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దేశ్యా నాయక్, మాన్య నాయక్, టోర్నమెంట్ నిర్వాహకులు రమేష్ నాయక్, శివ, గణేష్, శ్రీను, దేవ్ సింగ్,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




