Medchal: మేడ్చల్ విద్యార్థుల ఆహారశైలిలో మార్పు రావాలి:..డా. విక్రాంత్ సింగ్!

Medchal: మేడ్చల్ రెడ్ సన్ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్యంపై అవగాహన సదస్సులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ పాల్గొని మాట్లాడారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 5 Nov 2026 1:51 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్ విద్యార్థుల ఆహారశైలిలో మార్పు రావాలి:..డా. విక్రాంత్ సింగ్!

Medchal: మారుతున్న ఆహారపు అలవాట్లు.. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ అన్నారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు.

గురువారం మేడ్చల్ పట్టణంలోని రెడ్ సన్ కళాశాలలో విద్యార్థుల కోసం ఆరోగ్యంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం, రోజువారీ ఆరోగ్య అలవాట్లపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, అధిక చక్కెర కలిగిన ఆహార పదార్థాల వినియోగం పెరుగుతోందని, వీటికి దూరంగా ఉంటూ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే నిజమైన సంపద అని, చిన్న వయసు నుంచే మంచి ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL