Vikarabad: మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు: పోలీసులు

Vikarabad: వికారాబాద్‌లో మద్యం మత్తులో వాహనం నడిపి 241 రీడింగ్ నమోదైన వ్యక్తికి న్యాయస్థానం ట్రాఫిక్ డ్యూటీ విధించింది. మందుబాబులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 12 Nov 2026 5:33 PM IST
Vikarabad
X

Vikarabad: మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు: పోలీసులు

వికారాబాద్: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని వికారాబాద్ పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ బ్రీత్ అనలైజర్ పరీక్షలో 241 రీడింగ్ నమోదైన వ్యక్తిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన గౌరవనీయ మెజిస్ట్రేట్ అతనికి ట్రాఫిక్ డ్యూటీ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి న్యాయస్థానం ట్రాఫిక్ డ్యూటీ, సోషల్ సర్వీస్ వంటి శిక్షలు విధించడం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.

ఈ సందర్భంగా వికారాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల మీ ప్రాణాలకే కాకుండా రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడపకండి.. ప్రమాదాలకు దూరంగా ఉండండి.. మీ కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేయకండి. రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పోలీసులు సూచించారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD