Hyderabad: ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఆదివాసులకే కేటాయించాలి!
Hyderabad: తెలంగాణ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని ఆదివాసీలకే కేటాయించాలని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సాగబోయిన పాపారావు డిమాండ్ చేశారు.
Hyderabad: ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఆదివాసులకే కేటాయించాలి!
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం హర్షణీయమని ఆదివాసీ విద్యార్థి సంఘం (ASU) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సాగబోయిన పాపారావు పేర్కొన్నారు. అయితే కమిషన్ చైర్మన్ పదవిని అర్హత, సామర్థ్యం, సామాజిక నిబద్ధత కలిగిన ఆదివాసీ వ్యక్తికే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివాసీల భూములు, అటవీ హక్కులు, విద్య, ఉద్యోగాలు, వైద్యం వంటి సమస్యల పరిష్కారంపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పెసా చట్టం, 1/70 చట్టం అమలును పర్యవేక్షిస్తూ ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడాలని సూచించారు. ఆదివాసీ మేధావులు, విద్యావేత్తలు, న్యాయ నిపుణులకు కమిషన్లో ప్రాతినిధ్యం కల్పించాలని, ఆదివాసీల గొంతుకగా కమిషన్ నిలవాలని డాక్టర్ పాపారావు కోరారు.




