Kadthal: కడ్తాల్ మండలంలో ఘనంగా భవానీ మాత పడి పూజా కార్యక్రమం!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం టాక్‌రాజ్‌గూడ తండాలో భవానీ మాత పడి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 6 Oct 2026 7:54 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్ మండలంలో ఘనంగా భవానీ మాత పడి పూజా కార్యక్రమం!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సన్మార్గంతో ముందుకు సాగితే ఒత్తిళ్లను అధిగమించి ఆనందమయ జీవితం పొందవచ్చని టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ అన్నారు. ప్రతి ఒక్కరూ దైవ కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాలని వారు పిలుపునిచ్చారు.

కడ్తాల మండలం టాక్‌రాజ్‌గూడ తండాలో మంగళవారం భవానీ మాత పడి పూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తండా నాయకుడు శివరాం నాయక్, బుజ్జి దంపతుల కుమారుడు, స్థానిక ఉపసర్పంచ్ దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలు కొనసాగాయి. భవానీ మాత నామస్మరణతో టాక్‌రాజ్‌గూడ తండా మారుమోగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, యాట నర్సింహ మాట్లాడుతూ దైవ కార్యక్రమాలు ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు దోహదపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు హేమ్ల, రాంకీ, శ్రీను, శ్రీధర్, పవన్, రాజు, వినోద్, రామచందర్, రాములు, కోటియా, వున్య తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY