Nacharam: హెచ్ఎంటి నగర్లో ప్రత్యేక పట్టభద్రుల ఓటరు నమోదు క్యాంప్
Nacharam: నాచారం హెచ్ఎంటి నగర్ పరిధిలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రత్యేక క్యాంప్. నవంబర్ 6 చివరి తేదీ అని, అర్హులంతా నమోదు చేసుకోవాలని సాయిజెన్ శేఖర్ పిలుపు.
Nacharam: హెచ్ఎంటి నగర్లో ప్రత్యేక పట్టభద్రుల ఓటరు నమోదు క్యాంప్
నాచారం: హెచ్ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ ఆధ్వర్యంలో కాంక్రీట్ ప్లాజా అపార్ట్మెంట్ ఆవరణలో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపును ఏర్పాటు చేశారు.
ఈ క్యాంపులో పలువురు పట్టభద్రులు తమ ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ, పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ కావడంతో, ఇప్పటివరకు ఓటు నమోదు చేసుకోని అర్హులైన పట్టభద్రులందరూ గడువులోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.




