Kadtal: కడ్తాల్ వివేకానంద యూత్‌లో గణేశ్ పూజలు: గంప వెంకటేష్ గుప్తా
Kadtal: కడ్తాల్ వివేకానంద యువజన సంఘం గణపతి మండపంలో ఆమనగల్ సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు.
Kadtal: కడ్తాల్ వివేకానంద యూత్‌లో గణేశ్ పూజలు: గంప వెంకటేష్ గుప్తా
రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మండలం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కడ్తాల్ పట్టణంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల రాఘవేందర్ స్థాపించిన స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన బొజ్జ గణపయ్యకు ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, సర్పంచ్ బిక్షపతి లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ పూజా కార్యక్రమాల అనంతరం గంప రాఘవ కుమారుడు చిరంజీవి సరవిక్ పుట్టినరోజు సందర్భంగా వినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గంప వెంకటేష్ గుప్త మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని అన్నారు.
స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో గణేష్ మండపంలో ప్రతిష్టించిన వినాయకుడు మనందరికీ విఘ్నాలు తొలగించి.. శుభాలు కలిగించాలని ఆ పార్వతి సుతుడి ఆగమానం.. ఇంటింటా ఆనందం వెళ్లి విరియాలని ఆయన మనసారా కోరుతున్నానని తెలిపారు.
అనంతరం 1500 మంది భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. వినాయక నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ఎలాంటి ఇబ్బందులకు తావివ్వకుండా నిర్వహించాలని కోరారు. పోలీసులు సూచించిన మార్గంలో నిమజ్జన వేడుకలను నిర్వహించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కడ్తాల సర్పంచ్ రాయ కంటి బిక్షపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదగిరి రెడ్డి, మాజీ ఎంపిటిసి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, మాజీ జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, మాజీ వార్డు సభ్యులు రామచంద్రయ్య, హెచ్ఆర్ మహేష్, వివేకనంద యువజన సంఘం అధ్యక్షుడు క్యామ మహేష్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, వార్డు సభ్యులు పెరుమాళ్ళ లక్ష్మమ్మ మల్లయ్య, జహంగీర్ బాబా, కృష్ణవేణి రమేష్, మమత మహేష్, భాను కిరణ్, కొప్పు వసంత, కొప్పుకుష్ణ, దొడ్డు పుల్లమ్మ, నాగరాజు, మాదారం గణేష్ గౌడ్, మంకీ మహేష్, ముత్తికృష్ణ, విజయ్ కుమార్, రవి నాయక్, ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బి రామకృష్ణ గుప్తా, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు బి వీరేందర్ గుప్తా, వీరేష్, గంప రాజేష్, చంద్రయ్య గుప్తా, నవీన్ గుప్తా, కంబాలపల్లి అంజి, బీజేపీ నాయకులు రవి, యాదగిరి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు అమృతం పాండు, గంప కుటుంబ సభ్యులు జగదీష్, సంతోష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




