Talakondapally: బతుకమ్మ నిమజ్జనానికి గట్టు ఇప్పలపల్లిలో ప్రత్యేక ఏర్పాట్లు!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లిలో బతుకమ్మ నిమజ్జనం కోసం చెరువు వద్ద మెట్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ చంద్రశేఖర్.
Talakondapally: బతుకమ్మ నిమజ్జనానికి గట్టు ఇప్పలపల్లిలో ప్రత్యేక ఏర్పాట్లు!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇఫ్పలపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు గ్రామ సర్పంచ్ జీనుకుంట్ల చంద్రశేఖర్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సమయంలో మహిళలు గౌరమ్మ తల్లిని చెరువులో నిమజ్జనం చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మహిళలు స్వయంగా చెరువులోకి వెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేసుకునేలా ఊర చెరువు వద్ద ప్రత్యేకంగా మెట్లు నిర్మించారు.
అలాగే రాత్రి వేళల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి విద్యుత్ దీపాల ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జీనుకుంట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చెరువు వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిత విజయ్, వార్డు సభ్యులు రాజశేఖర్, రేణు రెడ్డి, మేస్త్రీలు నరసింహ, జీవ తదితరులు పాల్గొన్నారు.




