Vikarabad: స్పీకర్ గడ్డం ప్రసాద్ చొరవతో CMRF కింద లక్ష రూపాయలు మంజూరు!

Vikarabad: వికారాబాద్ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ది రసమ్మకు సీఎంఆర్‌ఎఫ్ కింద రూ. లక్ష ఎల్ఓసి మంజూరైంది.

MOGULAIAH, VIKARABAD
Published on: 1 Nov 2026 12:04 PM IST
Vikarabad
X

Vikarabad: స్పీకర్ గడ్డం ప్రసాద్ చొరవతో CMRF కింద లక్ష రూపాయలు మంజూరు!

Vikarabad: వికారాబాద్ కు చెందిన పెద్ది మల్లయ్య భార్య పెద్ది రసమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది.

వెంటనే స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) లో చికిత్స నిమిత్తం రూ. 1,00,000/- (రూ. ఒక లక్ష) మంజూరు చేయించారు.

ఈ LOC తో బాధితురాలు నిమ్స్ లో అడ్మిట్ అయ్యి, తక్షణ వైద్య చికిత్స పొందవచ్చు.

అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, CMRF ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చూస్తామని ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు తెలిపారు.

CMRF కింద LOC మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి బాధితురాలు పెద్ది రసమ్మ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD