Vikarabad: వికారాబాద్ ప్రభుత్వ దవాఖానాలో సదరం శిబిరం ప్రారంభం!
Vikarabad: శారీరక లోపం ఎదుగుదలకు అడ్డు కాదు: వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అర్హులైన దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశం.
Vikarabad: వికారాబాద్ ప్రభుత్వ దవాఖానాలో సదరం శిబిరం ప్రారంభం!
వికారాబాద్: శారీరక లోపం ఎదుగుదలకు అడ్డు కాదని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వికలత్వ నిర్దారణ పరీక్ష కేంద్రమును శాసన సభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ సదరం శిభిరానికి వచ్చే వారికి మౌలిక వసతులు కల్పించాలన్నారు. సెర్ప్ ద్వారా 10 లక్షల రూపాయల నిధులతో ప్రత్యేకంగా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో సదరం శిబిరం ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. వికలత్వ నిర్దారణ పరీక్షకు వచ్చే వారికి ఈ శిబిరం ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు.
ప్రతి అర్హుడైన దివ్యాంగునికి సదరం సర్టిఫికేట్ అందేలా చూడాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు మందులను ఎప్పటికీ అందుబాటులో ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కావాల్సిన అవసరాలు, సిబ్బంది వివరాలను సభాపతి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సదరం శిబిరం ప్రారంభోత్సవంలోజిల్లా కలెక్టర్ దిపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




