Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు 'స్పీక్' సంస్థ మద్దతు..

Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కొనసాగించాలని కోరుతూ 'స్పీక్' సంస్థ అధ్యక్షుడు విద్యాసాగర్ హైకోర్టు ఫుల్ బెంచ్ లో అప్పీల్ చేయనున్నట్లు ప్రకటించారు.

RAJESH,	WEST ZONE
Published on: 29 July 2026 11:01 PM IST
Hyderabad
X

Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు 'స్పీక్' సంస్థ మద్దతు..

హైదరాబాద్: హైడ్రా కమీషనర్ గా రంగనాధుని కొనసాగించాలని తమ సంస్థ హైకోర్టు ఫుల్ బెంచ్ కు అప్పీల్ కు వెళుతున్నట్లు సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విత్ యాక్షనబుల్ నాలెడ్జ్ (స్పీక్ ) అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సలహాదారుడు సత్యనారాయణ తో కలిసి మాట్లాడారు. కొంతమంది వ్యక్తులు న్యాయస్థానాన్ని తప్పు దోవ పట్టించడం వల్ల అటువంటి ఆర్డర్స్ వచ్చాయని తాము భావిస్తున్నామని అన్నారు. దీనిపై తమ సంస్థ తరఫున ఫుల్ బెంచ్ లో అప్పిల్ చేయనున్నట్లు

తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జాదారుల చర నుంచి విముక్తి కలిగించిందని అన్నారు. కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నందునే కొంతమంది ఈ తరహా వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న హైడ్రా కు అండగా మేము ఉండాలని నిర్ణయించుకునే ఫుల్ బెంచ్ ఆపిల్ కు వెళ్తున్నట్లు తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story