Kushaiguda: కుషాయిగూడలో పేకాట స్థావరంపై దాడి ఆరుగురి అరెస్ట్!

Kushaiguda: కుషాయిగూడ ద్వారకాపురి కాలనీలో పేకాట స్థావరంపై ఉప్పల్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. రూ. 18,700 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ASHOK, KAPRA
Published on: 29 Sept 2026 7:28 PM IST
Kushaiguda
X

Kushaiguda: కుషాయిగూడలో పేకాట స్థావరంపై దాడి ఆరుగురి అరెస్ట్!

Kushaiguda: విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఉప్పల్‌ ఎస్‌వోటీ పోలీసులు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ద్వారకాపురి కాలనీలో మంగళవారం పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న మౌలాలికి చెందిన జనార్దన్‌రెడ్డి (63), కీసర

కు చెందిన సుదర్శనాచారి (65), మౌలాలికి చెందిన బద్రిగటి వెంకట రమణారెడ్డి (55), హబ్సిగూడకు చెందిన వందినీరు వెంకట రమణ (60), కుషాయిగూడకు చెందిన తాటికంటి సంపత్‌ (55), సోనియాగాంధీ నగర్‌కు చెందిన పగడాల బాలస్వామి (45)లను అరెస్ట్‌ చేశారు. యల్లారెడ్డిగూడకు చెందిన లక్ష్మణ్‌ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

దాడిలో రూ.18,700 నగదు, నాలుగు పేకముక్కల సెట్లు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌ చేసిన ఆరుగురితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని కుషాయిగూడ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA