Chandanagar: వాటర్ ట్యాంకర్ ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం
Chandanagar: చందానగర్ నల్లగండ్ల ఫ్లైఓవర్ సిగ్నల్ వద్ద అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఢీకొని బీరంగూడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఏ. రాజ్‌కుమార్ (40) మృతి చెందారు.
Chandanagar: వాటర్ ట్యాంకర్ ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం
చందానగర్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల ఫ్లైఓవర్ సిగ్నల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందారు. అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. బీరంగూడకు చెందిన ఏ. రాజ్‌కుమార్ (40) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఆయన తన హోండా యాక్టివాపై గచ్చిబౌలి నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తున్నారు. నల్లగండ్ల ఫ్లైఓవర్ సిగ్నల్ వద్దకు చేరుకోగానే, పక్క నుంచి అత్యంత నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన వాటర్ ట్యాంకర్ (TS 08 UA 8274) రాజ్‌కుమార్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి 9 ఏళ్లు, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.




