Talakondapally: చుక్కాపూర్లో కాలూరి బాలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన పాపిశెట్టి రాము
Talakondapally: తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో అనారోగ్యంతో మృతి చెందిన కాలూరి బాలమ్మ కుటుంబాన్ని ప్రముఖ సంఘ సేవకులు పాపిశెట్టి రాము పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
Talakondapally: చుక్కాపూర్లో కాలూరి బాలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన పాపిశెట్టి రాము
రంగారెడ్డి జిల్లా: తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన కాలూరి బాలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ పాపిశెట్టి రాము వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బాలమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన పాపిశెట్టి రాము కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శృతిలయ కల్చరల్ అకాడమీ చైర్మన్ దార్ల చిత్తరంజన్ దాస్ రామన్న మిత్ర మండలి సభ్యులు , శ్రీను నాయక్, భుజంగం, ఎర్ర శీను, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




