Amanagallu: సింగల్ విండో ద్వారా రైతులకు డ్రోన్ అద్దె సేవలు: గంప వెంకటేష్ గుప్తా!

Amanagallu: ఆమనగల్లు సింగల్ విండో ఆధ్వర్యంలో రైతులకు స్వల్ప అద్దెకే పురుగుమందులు చల్లే అత్యాధునిక డ్రోన్ సేవలను చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా ప్రారంభించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 5 Oct 2026 9:21 PM IST
Amanagallu
X

Amanagallu: సింగల్ విండో ద్వారా రైతులకు డ్రోన్ అద్దె సేవలు: గంప వెంకటేష్ గుప్తా!

ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం ఆమనగల్లు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఆమనగల్లు, కడ్తాల్ మండలాల పరిధిలోని పరిసర గ్రామాల రైతన్నల కోసం ఆమనగల్లు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో స్వల్ప అద్దెకు డ్రోన్ అందుబాటులో ఉందని అవసరమున్న రైతులు వాటి సేవలను వినియోగించుకోవాలని ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా తెలిపారు.

సోమవారం సింగల్ విండో కార్యాలయ ఆవరణలో పాలకవర్గంతో కలిసి డ్రోన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ రైతులు కూలీలు దొరకక అవస్థలు పడుతుంటారని వారి కోసం సింగల్ విండో ద్వారా రసాయన ఎరువులను చల్లేందుకు డ్రోన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ డ్రోన్ ద్వారా ఒక గంటకు 2 నుంచి మూడు ఎకరాల వరకు ఫెర్టిలైజర్ మందులను పిచికారి చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచుకోవాలని ఆయన తెలిపారు.

అదే విధంగా సింగల్ విండో ద్వారా రైతులకు ఎరువులు అందించడం జరుగుతుందని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సింగల్ విండో ఎల్లప్పుడూ అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా డిసిసిబి బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రైతన్నల కోసం రుణాలు అందించడం జరిగిందని తెలిపారు. సింగల్ విండో సేవలను రైతులు సద్వినియోగపరచుకోవాలని గంప వెంకటేష్ గుప్తా తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగల్ విండో వైస్ చైర్మన్ దోనాదుల సత్యం, డైరెక్టర్లు ఎనుమల జంగమ్మ, దావ శ్రీ పాల్, చేగురి వెంకటేష్ బెయిలి వెంకటయ్య, జోగు వీరయ్య, కౌన్సిలర్ ఎనుముల రమేష్, సీఈవో పద్మాకర్ రెడ్డి, సిబ్బంది దేవేందర్, అల్లాజీ, మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY