Hyderabad: భూభారతి ఆపరేటర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి!
Hyderabad: భూభారతి ఆపరేటర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పోలీసుల అక్రమ నిర్బంధంపై విచారణ జరపాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
Hyderabad: భూభారతి ఆపరేటర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి!
Hyderabad: భూభారతి ఆపరేటర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు, పోలీసుల అక్రమ నిర్బంధం, దాడి ఆరోపణలపై చట్టప్రకారం విచారణ జరిపించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు.
కామారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన పి.లింగం దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన కమిషన్.. రాష్ట్రంలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న భూభారతి ఆపరేటర్లకు ఏడు నెలలుగా వేతనాలు అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
వేతనాలు చెల్లించకపోవడం వారి జీవనోపాధిని దెబ్బతీయడమే కాకుండా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన గౌరవప్రదమైన జీవించే హక్కుకు భంగం కలిగిస్తుందని పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 6న రెవెన్యూ శాఖ కార్యదర్శికి వేతన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
మరో కేసులో గోల్కొండకు చెందిన షేక్ సాజిద్ అహ్మద్‌పై 2025 అక్టోబర్ 31న పోలీసులు అక్రమ నిర్బంధం, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కమిషన్ స్పందించింది. వైద్య రికార్డుల్లో గాయాలు నమోదవడం, పోలీసుల వివరణ సంతృప్తికరంగా లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకుంది.
ఫిర్యాదుదారుడిపై నమోదైన కేసు ప్రతిచర్యగా నమోదైనట్లు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై చట్టప్రకారం విచారణ జరిపి, ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సిఫార్సు చేసింది.




