Amangal: శెట్టిపల్లిలో బతుకమ్మ వేళ ఎంభాయి కుంటను శుభ్రం చేయించిన సర్పంచ్ జంగమ్మ!
Amangal: ఆమనగల్ మండలం శెట్టిపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఎంభాయి కుంటను శుభ్రం చేయించిన సర్పంచ్ జంగమ్మ వెంకటయ్య. ముందస్తు చర్యలపై గ్రామస్తుల హర్షం.
Amangal: శెట్టిపల్లిలో బతుకమ్మ వేళ ఎంభాయి కుంటను శుభ్రం చేయించిన సర్పంచ్ జంగమ్మ!
Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం శెట్టిపల్లి గ్రామ సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ వెంకటయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామంలోని ఎంభాయి కుంట చెత్తాచెదారంతో నిండిపోవడంతో పండుగకు వచ్చే ఆడపడుచులు, మహిళలు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా జేసీబీ సహాయంతో కుంటను శుభ్రం చేయించారు.
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో సర్పంచ్ పాలకవర్గంతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పండుగ వేళ మహిళలు, గ్రామ ప్రజలు సంతోషంగా బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజల సౌకర్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సర్పంచ్ చొరవపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొంటున్నారు.




