Shankarpally: బుల్కాపురంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ ప్రారంభించిన సబితారెడ్డి
Shankarpally: శంకర్పల్లి మున్సిపాలిటీ బుల్కాపురంలో కొత్త హెచ్‌పీ పెట్రోల్ బంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి; నాణ్యమైన సేవలపై అతిథుల సూచనలు.
Shankarpally: బుల్కాపురంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ ప్రారంభించిన సబితారెడ్డి
శంకర్పల్లి: శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపురం వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హిందుస్థాన్ పెట్రోలియం పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు. మరింత శక్తి –మరిన్ని అవకాశాలు అనే నినాదంతో నిర్వాహకులు రేవంత్ రావు, నాగేంద్రల ఆధ్వర్యంలో ఈ నూతన బంక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. శంకర్పల్లి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా బుల్కాపురంలో హెచ్.పీ. పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం స్థానికులకు, వాహనదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.
నిర్వాహకులు వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్.పీ.సి.ఎల్. (HPCL) జనరల్ మేనేజర్ ఆశిష్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. వాహనదారులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన ఇంధనాన్ని పెట్రోల్, డీజిల్ కచ్చితమైన నాణ్యత అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.




