Shamshabad: అమెరికా వీసా ఆందోళనతో యువకుడు ఆత్మహత్య!
Shamshabad: అత్తాపూర్ తేజస్వినగర్‌లో అమెరికా వీసా ఆందోళనతో రోహిత్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Shamshabad: అమెరికా వీసా ఆందోళనతో యువకుడు ఆత్మహత్య!
శంషాబాద్: అమెరికా వీసా ఆందోళనతో యువకుడి ఆత్మహత్య అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తేజస్వినగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
రోహిత్ రెడ్డి (26) అనే యువకుడు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలో చదువుకునేందుకు గతంలో ఒకసారి వీసా నిరాకరణకు గురికాగా, రెండోసారి వీసా కోసం ప్రయత్నిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వీసా వస్తుందో రాదోనని పలుమార్లు తల్లిదండ్రులతో చర్చించినట్లు పేర్కొన్నారు. వీసా విషయంలో ఉన్న ఆందోళనే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.




