Shamshabad: బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
Shamshabad: శంషాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్‌లో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
Shamshabad: బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
శంషాబాద్: గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి అత్తాపూర్, హైదర్‌గూడ ప్రాంతాల్లోని బియ్యం షాపులలో సివిల్ సప్లై శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు. బియ్యం హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
అలాగే 25 కిలోల బియ్యం బ్యాగును 26 కిలోలుగా చూపిస్తూ వినియోగదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో రాజేంద్రనగర్ ఏఎస్ఓ పుల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, చెకింగ్ ఇన్‌స్పెక్టర్ మహేశ్వర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.




