Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానానికి బాంబు బెదిరింపు కలకలం!
Shamshabad: అహ్మదాబాద్ నుండి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది.
Shamshabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానానికి బాంబు బెదిరింపు కలకలం!
Shamshabad: అహ్మదాబాద్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న ఇండిగో ((6E6728) విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. హైదరాబాద్ కు చెందిన సుచిత్ర అకాడమీ స్కూల్ విద్యార్థులు 47 మంది ఎక్స్కర్షన్ వెళ్లి తిరిగి అదే విమానంలో వస్తున్నారు. విమానంలో ఉన్న ఓ విద్యార్థిని " విమానంలో బాంబు ఉంది" అని అనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండింగ్ అనంతరం రన్వేపై అధికారులు క్షుణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపి విమానాన్ని ఐసోలేషన్ బె కు తరలించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.




