Shamshabad: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘన రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన కార్లు!

Shamshabad: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై పిల్లర్ నంబర్ 165 వద్ద ఘన రోడ్డు ప్రమాదం. కియా కారును వెనుక నుంచి మరో కారు ఢీకొనడంతో నిలిచిపోయిన ట్రాఫిక్.

ANJAIAH, SHAMSHABAD
Published on: 10 Nov 2026 9:23 AM IST
Shamshabad
X

Shamshabad: పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘన రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన కార్లు!

Shamshabad: పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాజేంద్రనగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం. మెహదీపట్నం నుంచి అరాంఘర్ వెళ్తుండగా పిల్లర్ నంబర్ 165 వద్ద కియా కార్ సడన్ బ్రేక్ వేయడం తో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొనడంతో కియా కార్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. అదృష్టవశాత్తూ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ​ప్రమాదానికి గురైన కారు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే రెస్క్యూ చర్యలు చేపట్టి కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD