Shahbad: షాబాద్‌లో కంది క్షేత్రాలను పరిశీలించిన జాయింట్ డైరెక్టర్
Shahbad: షాబాద్ మండలంలో ‘మిషన్ ఫర్ ఆత్మనిర్భర్త ఇన్ పల్సెస్’ కింద 85 హెక్టార్లలో చేపట్టిన కంది పంట క్షేత్రాలను జాయింట్ డైరెక్టర్ డా. శివహరే పరిశీలించారు.
Shahbad: షాబాద్‌లో కంది క్షేత్రాలను పరిశీలించిన జాయింట్ డైరెక్టర్
షాబాద్ మండలం: మిషన్ ఫర్ ఆత్మనిర్భర్త ఇన్ పల్సెస్ (యం.ఏ.ఎన్.పి) 2026–27 కార్యక్రమంలో భాగంగా షాబాద్ మండలంలో చేపట్టిన కంది పంట బ్లాక్ డెమాన్‌స్ట్రేషన్‌ను భోపాల్ పప్పుధాన్యాల అభివృద్ధి డైరెక్టరేట్ కు చెందిన జాయింట్ డైరెక్టర్ డా. ఏ.కె. శివహరే గురువారం పరిశీలించారు.
ఈ పర్యటనలో రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ కార్యాలయం జేడీఏ శ్రీ. బాలు నాయక్, రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి సుజాత, టెక్నికల్ ఏడీఏ శ్రీమతి పద్మజ, రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ కార్యాలయం వ్యవసాయ అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర, (ఎఫ్.పి.వో) సి.ఈ.ఓ కందివనం చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ లు చొక్కంపేట వీరమ్మ భాగన్న, పద్మమ్మ గోపాల్ డైరెక్టర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు శివ తేజ, మౌనిక, బాబ్య నాయక్, రాజేశ్వరి, శైలజ రైతులు ముత్యం రెడ్డి, ఎట్టేయ్య, బర్క వెంకటయ్య, దర్శనాల కృష్ణ, మొకర్ల జంగయ్య తదితర రైతులు పాల్గొని కంది పంట ప్రదర్శనా క్షేత్రాలను పరిశీలించారు.
షాబాద్ మండలంలో 85 హెక్టార్ల విస్తీర్ణంలో 207 మంది రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా ఈ బ్లాక్ డెమాన్‌స్ట్రేషన్‌ను చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు ఎల్.ఆర్.జి-133-33 రకం కంది విత్తనాలను సబ్సిడీపై అందించడంతో పాటు సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను అమలు చేస్తున్నారు.
సమగ్ర పంట యాజమాన్య ప్యాకేజీ:
విత్తన శుద్ధి: ట్రైకోడెర్మా విరిడీ సమగ్ర పోషక యాజమాన్యం (ఐ.ఎన్.యం): పి.ఎస్.బి, జింక్ సల్ఫేట్ మరియు బోరాన్ 20శాతం కలుపు మరియు పురుగు నివారణ (ఐ.పీఎం): పెండిమెథలిన్ 30శాతం ఇసి, క్లోరాన్‌ట్రానిలిప్రోల్ 18.5శాతం ఎస్.సి మరియు అజాడిరాక్టిన్ 0.15శాతం ఈ సందర్భంగా డా. శివహరే కంది పంటల పరిస్థితిని పరిశీలించి, బ్లాక్ డెమాన్‌స్ట్రేషన్‌లో పాల్గొంటున్న రైతులతో మాట్లాడారు.
పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, ఆర్థిక నష్టం స్థాయి ఆధారంగా అవసరమైనప్పుడు మాత్రమే పురుగు మందులను వినియోగించాలని, వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన మోతాదు మరియు సరైన సమయంలో ఇన్‌పుట్‌లను వినియోగించాలని రైతులకు సూచించారు. కంది పంట ప్రదర్శనా క్షేత్రాలు పరిసర ప్రాంత రైతులకు ప్రత్యక్షంగా నేర్చుకునే క్షేత్రాలుగా ఉపయోగపడుతున్నాయని అధికారులు తెలిపారు.
అలాగే రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ కార్యాలయం జేడీఏ శ్రీ. బాలు నాయక్ మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతుల్లో పంట సాగు చేయడం ద్వారా కంది పంట దిగుబడిని పెంచడం, అనవసరమైన పంట నష్టాలను తగ్గించడం, వ్యవసాయ ఇన్‌పుట్‌లను సమర్థవంతంగా వినియోగించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
“ఎక్కువ పప్పుధాన్యాల ఉత్పత్తి – అధిక ఉత్పాదకత – రైతులకు మెరుగైన ఆదాయం” అనే లక్ష్య సాధనలో యం.ఏ.ఎన్.పి పథకం అమలు కార్యక్రమం కీలకంగా దోహదపడుతుందని అధికారులు తెలిపారు.




