Shadnagar: షాద్‌నగర్ జ్యువెలరీ షాపులో మహిళ చేతివాటం.. బంగారం మాయం
Shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని శ్రీకృష్ణ జ్యువెలర్స్‌లో కస్టమర్‌గా వచ్చిన మహిళ రెండున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని చోరీ చేసింది.
Shadnagar: షాద్‌నగర్ జ్యువెలరీ షాపులో మహిళ చేతివాటం.. బంగారం మాయం
షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న శ్రీకృష్ణ జ్యువెలర్స్‌లో గురువారం మధ్యాహ్నం చోరీ ఘటన కలకలం రేపింది. కొనుగోలుదారురాలిగా వచ్చిన ఓ మహిళ అదును చూసి సుమారు రెండున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని చాకచక్యంగా అపహరించి అక్కడి నుంచి ఉడాయించినట్లు సమాచారం.
మధ్యాహ్న భోజన సమయం కావడంతో సిబ్బంది తక్కువగా ఉండటాన్ని గమనించిన మహిళ తన పథకాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది. షాపులో ఇతర సిబ్బంది పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ఎవరి కంటా పడకుండా మంగళసూత్రాన్ని కాజేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన మహిళ
సాధారణంగా వచ్చి వెళ్లే కస్టమర్ల మధ్య జరిగిన ఈ చోరీ ఘటన వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మహిళ చేసిన చేతివాటం షాపులోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చోరీకి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి రావడంతో ఘటనపై షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు..




