Shadnagar: పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలుపే లక్ష్యం: అంజయ్య యాదవ్!
Shadnagar: మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటరు నమోదును వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు.
Shadnagar: పట్టభద్రుల ఎమ్మెల్సీలో గెలుపే లక్ష్యం: అంజయ్య యాదవ్!
షాద్నగర్: షాద్నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని పద్మారం చౌరస్తాలో ఉమ్మడి కొందుర్గ్ మండల ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమావేశమయ్యారు. రానున్న మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతి గ్రామంలో పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ, డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. గతంలో పట్టభద్రుల ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు సైతం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆన్లైన్లో మళ్లీ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
ఓటరు నమోదు ప్రక్రియను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలకు అంజయ్య యాదవ్ సూచించారు. ప్రతి అర్హుడైన పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేలా క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.




