Shabad: రూ. 1.09 లక్షలకు వినాయక లడ్డూ దక్కించుకున్న సర్పంచ్ అశోక్

Shabad: షాబాద్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం. రూ. 1.09 లక్షలకు తొలి లడ్డూను దక్కించుకున్న సర్పంచ్ అశోక్. ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 24 Sept 2026 10:19 PM IST
Shabad
X

Shabad: రూ. 1.09 లక్షలకు వినాయక లడ్డూ దక్కించుకున్న సర్పంచ్ అశోక్

షాబాద్: నవరాత్రుల్లో పూజలు అందుకున్న వినాయకుడి లడ్డూను దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సర్పంచ్ అశోక్ అన్నారు. షాబాద్ మండల కేంద్రంలోని భగత్‌సింగ్ యూత్ కాలనీలో బుధవారం వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి.

ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంలో తొలి లడ్డూను సర్పంచ్ అశోక్ రూ.1.09 లక్షలకు కైవసం చేసుకున్నారు. రెండో లడ్డూను గల్లబుడి కాలనీకి చెందిన పోటుగంటి అంజయ్య రూ.12 వేలకు దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మహిళలు కోలాటం, బతుకమ్మ ఆడుతూ, భక్తులు భజనలు, భక్తిగీతాలతో ఉత్సాహంగా పాల్గొని వినాయక విగ్రహాన్ని శోభాయాత్రగా నిమజ్జనానికి తరలించారు. కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA