Shabad: షాబాద్ మండలంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పర్యటన
Shabad: షాబాద్ మండలంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పర్యటించి పింఛన్లు పంపిణీ చేశారు, గృహప్రవేశ వేడుకలో పాల్గొన్నారు.
Shabad: షాబాద్ మండలంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పర్యటన
షాబాద్: షాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చేయూత పింఛన్ల సర్టిఫికెట్ల పంపిణీ
ముందుగా గ్రామంలో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు వారి జీవనానికి ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకలో పాల్గొని..
అనంతరం షాబాద్ మండలం చందానవెల్లి గ్రామంలో ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మీరంపల్లి మంజుల బాలరాజ్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పేర్కొన్నారు.
బీరప్ప–మహంకాళి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనలో..
అనంతరం పోతుగల్ గ్రామంలో నిర్వహించిన బీరప్ప–మహంకాళి దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యత, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ పర్యటనలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్, సర్పంచులు ఈగ ప్రభాకర్ రెడ్డి, నవనీత స్వామి, రాజేందర్ రెడ్డి, స్వరూప మహేందర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




