Shabad: షాబాద్‌లో భూవివాదం: హత్యాయత్నం కేసులో 9 అరెస్ట్!

Shabad: షాబాద్ మండలం హైతాబాద్‌లో భూవివాదంపై జరిగిన హత్యాయత్నం కేసులో 9 మందిని అరెస్ట్ చేసి, కత్తులు, కార్లు, బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 24 Oct 2026 7:00 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో భూవివాదం: హత్యాయత్నం కేసులో 9 అరెస్ట్!

Shabad: తేదీ 23.10.2026న షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 202లోని భూమి మరియు ఇతర భూములకు సంబంధించిన దీర్ఘకాలిక వివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హైతాబాద్ గ్రామంలోని మసీదులో చర్చల కోసం సమావేశమైన సమయంలో ఈ ఘటన జరిగింది.

పోలీసుల దర్యాప్తు ప్రకారం, చాంద్ పాషా మరియు అతని కుమారులైన సోహెల్, ఫైజల్‌లపై దాడి చేయడానికి నిందితులు ముందస్తు పథకం వేసుకున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్‌పై ఆయుధాలతో అక్కడికి చేరుకుని వారిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘర్షణ సమయంలో ముజఫర్ ఉద్దీన్ ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం జరిగిన ఘర్షణలో వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.

ఈ కేసులో షాబాద్ పోలీసులు తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పంచుల సమక్షంలో నిర్వహించిన విచారణలో భాగంగా రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్, రెండు క్రికెట్ బ్యాట్‌లు, కత్తి మరియు పలు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకోబడతాయి.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA