Shabad: నోటీసులు లేకుండా కూల్చివేతల యత్నం.. పెద్దవీడులో ఆగ్రహం

Shabad: షాబాద్ మండలం పెద్దవీడులో సర్వే నం.147లోని పాఠశాల, ఆలయం, ఇళ్ల కూల్చివేత యత్నంపై గ్రామస్తుల ఆగ్రహం; న్యాయం చేయకుంటే ఆత్మహత్య హెచ్చరిక.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 22 Nov 2026 6:05 PM IST
Shabad
X

Shabad: నోటీసులు లేకుండా కూల్చివేతల యత్నం.. పెద్దవీడులో ఆగ్రహం

షాబాద్: షాబాద్ మండల పరిధిలోని పెద్దవీడు గ్రామంలో సర్వే నంబర్ 147లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను, రామాలయం, క్రీడా ప్రాంగణం, చెట్ల నర్సరీ దాని పక్కనే ఉన్న కావలి పద్మమ్మ, గౌండ్ల యాదయ్య 23 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నాం మా ఇండ్లను కూల్చివేసేందుకు అమెజాన్ సంస్థ ప్రతినిధులు ప్రయత్నిస్తుండటంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎలాంటి ముందస్తు సమాచారం నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లను, పిల్లలు చదువుకునే బడిని కూల్చివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ చక్కటి రాజ సులోచన రెడ్డి, గ్రామస్తులు అమెజాన్ సంస్థ సంబంధించిన వ్యక్తులను ప్రశ్నించగా.. మకు ఎమ్మార్వో అనుమతి ఉందని, అందుకే కూల్చివేత పనులు చేపడుతున్నామని సమాధానమిచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

సర్పంచ్ గ్రామస్తులు మాట్లాడుతూ...అంతేకాకుండా, తమకు గ్రామ పంచాయతీ అనుమతితో పనిలేదని సంస్థ ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

గతంలో అమెజాన్ సంస్థ తమకు కేటాయించిన భూముల పరిధి వరకు ప్రహరీ గోడను నిర్మించుకుందని, ఇప్పుడు ఆ పరిధి దాటి గ్రామ పంచాయతీ పరిధిలోని భూములను సైతం కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతోందని గ్రామస్తులు మండిపడుతున్నారు.

మేము రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలం. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను, మా పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే ప్రభుత్వ పాఠశాలను కూల్చివేయడానికి వీళ్లెవరు..

తమకు తక్షణమే న్యాయం చేయకపోతే ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ఎమ్మార్వో, ప్రజాప్రతినిధులు స్పందించి అమెజాన్ సంస్థ ఆగడాలను అడ్డుకోవాలని, తమ ఇళ్లను, పాఠశాలను కాపాడి న్యాయం చేయాలని పెద్దవేడు గ్రామ ప్రజలు కోరుతున్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA