Shabad: బీరప్ప ఆలయానికి రూ.1 లక్ష విరాళమిచ్చిన అవినాష్ రెడ్డి
Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని బీరప్ప ఆలయ అభివృద్ధికి మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి రూ.1 లక్ష విరాళం అందజేశారు.
Shabad: బీరప్ప ఆలయానికి రూ.1 లక్ష విరాళమిచ్చిన అవినాష్ రెడ్డి
షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో బీరప్ప ఆలయ అభివృద్ధికి మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి తన వంతు సహాయంగా రూ.1 లక్ష విరాళం అందజేశారు.
సోమవారం గ్రామంలోని బీరప్ప ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటుగా రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఆధ్యాత్మికత, భక్తిభావం పెంపొందించేందుకు ఆలయాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఐక్యతకు ఆలయాలు వేదికలుగా నిలుస్తాయని, దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.
అనంతరం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పట్నం అవినాష్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన ఆర్థిక సహాయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింహులు, గ్రామస్తులు యాదయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, వెంకటేష్, మునీర్, రాజు నాయక్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




