Shabad: అమెజాన్ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల తరగతి గదుల ప్రారంభం
Shabad: షాబాద్ మండలం తాళ్లపల్లిలో అమెజాన్ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు.
Shabad: అమెజాన్ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల తరగతి గదుల ప్రారంభం
షాబాద్: షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామంలో అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పాఠశాల తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రం, SHG రిసోర్స్ సెంటర్, భవిత కేంద్రం మరియు నూతనంగా నిర్మించిన డైనింగ్ హాళ్లను స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. నూతన తరగతి గదులు మరియు ఇతర మౌలిక వసతులతో విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.
తాళ్లపల్లి గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న అమెజాన్ సంస్థ ప్రతినిధులకు, గ్రామపంచాయతీకి ఎమ్మెల్యే కాలే యాదయ్య అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




