Shabad: రుద్రారంలో 'జనసురక్ష' ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
Shabad: షాబాద్ మండలం రుద్రారంలో జనసురక్ష ఆర్థిక అక్షరాస్యత సదస్సు నిర్వహించారు. బీమా పథకాలు, సైబర్ భద్రతపై ఎస్‌బీఐ మేనేజర్ దివ్య అవగాహన కల్పించారు.
Shabad: రుద్రారంలో 'జనసురక్ష' ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు
షాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY) పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాగర్‌గూడ SBI బ్యాంక్ మేనేజర్ దివ్య మేడమ్ సూచించారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని రుద్రారం గ్రామంలో జనసురక్ష క్యాంపెయిన్‌లో భాగంగా ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా దివ్య మేడమ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాల్లో నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, అవసరమైన మార్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అలాగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్‌గూడ SBI బ్యాంక్ మేనేజర్ దివ్య మేడమ్, రుద్రారం గ్రామ సర్పంచ్ యాదిరెడ్డి గారు, ఉపసర్పంచ్ యాదమ్మ గారు, గ్రామ కార్యదర్శి చిన్న గారు, ఏడుగురు వార్డు సభ్యులు, CC జంగయ్య గారు, VOAs మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో షాబాద్ CFL ఆర్థిక అక్షరాస్యత కేంద్రం తరఫున బి. నవనీత, తబస్సుమ్, పి. స్వప్న ముఖ్య పాత్ర పోషించారు. గ్రామస్థులకు ప్రభుత్వ పథకాలపై మరియు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.




