Shabad: చందనవెల్లి ట్రీ ఫాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి ట్రీ ఫాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం; ముగ్గురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు, మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 22 Nov 2026 10:55 PM IST
Shabad
X

Shabad: చందనవెల్లి ట్రీ ఫాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. ముగ్గురికి గాయాలు

షాబాద్: షాబాద్ మండలం చందనవెల్లి పారిశ్రామిక ప్రాంతంలోని ట్రీ ఫాయిల్ (Treefoil) కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయాలతో బయటపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA