Shabad: హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడా గణేష్ వద్ద అన్నప్రసాద వితరణ
Shabad: షాబాద్‌లో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బడా గణేష్ పూజ, అన్నప్రసాద వితరణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్లుగంటి మధుసూదన్ రెడ్డి.
Shabad: హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడా గణేష్ వద్ద అన్నప్రసాద వితరణ
షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ చౌరస్తాలో ప్రతిష్ఠించబడిన బడా గణేష్ వద్ద హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం, అన్నప్రసాద వితరణను ఘనంగా నిర్వహించారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్, ఏగురి మల్లికార్జున్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. అన్నప్రసాదం స్వీకరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్లుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొని బడా గణేష్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలను భక్తిభావంతో, ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చే విధంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
పండుగల సందర్భంగా కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి అండగా నిలవడం అభినందనీయమన్నారు. హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టడం పట్ల నిర్వాహకులను అభినందించారు.
బడా గణేష్ ఉత్సవాల సందర్భంగా షాబాద్ చౌరస్తాలో భక్తులతో సందడి నెలకొంది. నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. యువత, స్థానికులు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఏగురి మల్లికార్జున్, కంశెట్టి శ్రీనివాస్, నవీన్, ప్రదీప్, తమ్మాలి అశోక్, బడా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు శ్రీనివాస్ పంతులు,కల్వకోల్ వెంకటయ్య యాదవ్ ,యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




