Shabad: వరికి బదులు కూరగాయలు, పశుగ్రాసం సాగు చేయండి.. షాబాద్ వ్యవసాయ శాఖ!

Shabad: సూపర్ ఎల్ నినో ప్రభావం దృష్ట్యా యాసంగిలో వరికి బదులుగా కూరగాయలు, పశుగ్రాసం సాగు చేయాలని షాబాద్ మండల వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 15 Nov 2026 2:37 PM IST
Shabad
X

Shabad: వరికి బదులు కూరగాయలు, పశుగ్రాసం సాగు చేయండి.. షాబాద్ వ్యవసాయ శాఖ!

Shabad: గౌరవ వ్యవసాయ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, వ్యవసాయ శాఖ డైరెక్టర్, మరియు హార్టికల్చర్ కమిషనర్ గార్ల ఆదేశాల మేరకు మండలంలోని వివిధ గ్రామాల గౌరవ సర్పంచు గార్లు, ఉపసర్పంచు గార్లు, వార్డు సభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులకు మరియు రైతులకు ముఖ్యమైన సమాచారం మరియు విన్నపం.

ఈ యాసంగి సీజన్ లో ప్రస్తుత సూపర్ ఎల్ నినో ప్రభావ పరిస్థితులలో వరికి బదులుగా కూరగాయలు, మరియు పశుగ్రాసం సాగుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టదలచింది ఇందుకుగాను ప్రతి గ్రామంలో రైతులు వరికి బదులుగా కూరగాయలు, పశుగ్రాసం సాగు చేయదలచిన రైతులు 16.11.2026, సోమవారం 12గo లోగా, వరికి పంటకు బదులు కావాల్సిన కూరగాయ & పశుగ్రాసం విత్తనాలు, డ్రిప్, sprinklers, pandals, మల్చింగ్ షీట్ వివరాలు, అలాగే ఎవరైనా రైతులు అందరూ ఒకే దగ్గర 25 ఎకరాల వరకు పంటలు వేసిన వారికి కోతులు మరియు పందుల బెడద నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఇవ్వబడును కావున రైతులు నమోదు చేసుకోవాలని కోరడమైనది.

పైన తెలిపిన విషయాన్నికి అనుగుణంగా కావాల్సిన రైతులు వెంటనే తమ ఆధార్, భూమి పాస్ బుక్, phone no, యాసంగిలో వరికి బదులుగా వేసే పంట వివరాలతో మీ సంబంధిత క్లస్టర్ AEOలకు అందచేయవలసిందిగా కోరుతున్నాము.

వ్యవసాయ శాఖ, షాబాద్ మండల AEOల వివరాలు,

పి శివతేజ, 6305920251 షాబాద్

క్లస్టర్ (షాబాద్, చర్లగూడ, ఎల్గొండగూడ, కుమ్మరిగూడ, నరెడ్ల గూడ, కేశవగూడ, గొల్లూరి గూడ, ముద్దెంగూడ, మల్లారెడ్డిగూడ, సంకేపల్లి గూడ, సీతారాంపూర్)

వై. మౌనిక 6305920252

మన్మర్రీ క్లస్టర్ ( మన్మర్రీ, బోడంపహాడ్, అప్పారెడ్డి గూడ, ఓబగుంట, కొమరబండ, తిరుమలాపూర్)

సి శైలజ 6305920253 కక్కులూర్ క్లస్టర్ (కక్కులూర్, సర్దారనగర్, కుర్వగూడ, బొబ్బిగామ కేసరం, రంగాపూర్, అనంతవరం)

శివ కుమార్ 6305920254 తాళ్ళపల్లి క్లస్టర్ ( తాళ్ళపల్లి, రేగడిదోసవాడ, నాగర్ గూడ, తిమ్మారెడ్డిగూడ, లక్ష్మారావుగూడ, ఎట్ల ఎర్రవల్లి, ముక్తగూడ, వెంకమ్మగూడ)

ఆర్ రాజేశ్వరి 6305920255 హైతాబాద్ క్లస్టర్ (హైతాబాద్, మద్దూరు, సోలిపేట్, చందనవెల్లి రుద్రారం)

కె.బాబ్యా నాయక్ 6305920205

మాచనపల్లి క్లస్టర్ (మాచనపల్లి, బోనగిరిపల్లి, దామెర్లపల్లి, నాగార్కుంట, పెద్దవీడు, పోలారం, పోతుగల్) గ్రామాల రైతులు మీరు అందించిన వివరాలు మాత్రమే యాక్షన్ ప్లాన్ లో నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించబడుతాయి. కావున మండలంలోని అందరు రైతులు పైన తెలిపిన విషయం పై వెంటనే తమ పేరుని నమోదు చేసుకోవాలని కోరడమైనది.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA