Medchal: కిష్టపూర్ ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్
Medchal: మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టపూర్ ప్రధాన రహదారిపై ప్రతిరోజూ సాయంత్రం ట్రాఫిక్ స్తంభిస్తోంది. ట్రాఫిక్ పోలీసుల్లేక ప్రజలే స్వయంగా క్లియర్ చేస్తున్నారు.
Medchal: కిష్టపూర్ ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్
మేడ్చల్ జిల్లా: పూడూరు కిష్టపూర్ డివిజన్ పరిధిలోని కిష్టపూర్ గ్రామ ప్రధాన రహదారిపై ప్రతిరోజూ సాయంత్రం వేళ తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒకవైపు ద్విచక్ర వాహనాలు, మరోవైపు భారీ వాహనాలు రహదారిపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ ముందుకు కదలని పరిస్థితి నెలకొంటోంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పరిస్థితుల్లో ప్రజలే స్వయంగా రంగంలోకి దిగి వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.
ప్రజలే ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సిన పరిస్థితి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజూ ఇదే సమస్య ఎదురవుతున్నా, ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు, వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.




