Serilingampally: జోనల్ ఆఫీస్‌లో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు!

Serilingampally: శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఐఏఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 15 Oct 2026 7:23 PM IST
Serilingampally
X

Serilingampally: జోనల్ ఆఫీస్‌లో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు!

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ (IAS) ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

జిహెచ్‌ఎంసి అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (UCD) మరియు అర్బన్ బయోడైవర్సిటీ (UBD) విభాగాల సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

ఈ వేడుకల్లో జోనల్ కమిషనర్‌తో పాటు యూసీడీ, యూబీడీ విభాగాల అధికారులు, మహిళా ఉద్యోగులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అందంగా అమర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు సాంప్రదాయ పాటలు పాడుతూ, ఆటలాడుతూ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగిన ఈ వేడుకలు కార్యాలయ ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నింపాయి.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY