Serilingampally: నివాసాల మధ్య ఎస్టీపీ వద్దు సీఎమ్‌సీ కమిషనర్‌కు విజ్ఞప్తి

Serilingampally: శేరిలింగంపల్లి ఆదిత్యనగర్‌లో ఇళ్ల మధ్య ఎస్టీపీ నిర్మాణాన్ని ఆపాలని సీఎమ్‌సీ కమిషనర్ సృజనకు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ నేత రవికుమార్ యాదవ్.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 29 Oct 2026 7:16 PM IST
Serilingampally
X

Serilingampally: నివాసాల మధ్య ఎస్టీపీ వద్దు సీఎమ్‌సీ కమిషనర్‌కు విజ్ఞప్తి

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి పరిధిలోని ఆదిత్యనగర్ కాలనీలో నివాస సముదాయాల మధ్య మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు, బీజేపీ నేతలు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనకు వినతిపత్రం సమర్పించారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సీతారామరాజుల నేతృత్వంలో కాలనీ ప్రతినిధులు కమిషనర్‌ను కలసి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గృహాల మధ్య ఎస్టీపీల నిర్మాణం వల్ల తీవ్ర దుర్వాసన వెదజల్లడమే కాకుండా దోమలు, కీటకాలు ప్రబలి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యానికి ఇది తీవ్ర ముప్పుగా మారుతుందని, అధికారులు వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో ఎస్టీపీలను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ వినతిపై కమిషనర్ సృజన సానుకూలంగా స్పందిస్తూ, సమస్యను పరిశీలించి స్థానికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిత్యనగర్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటరెడ్డి, భరత్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY