Secunderabad: పర్యావరణ పరిరక్షణ కోసం 15 ఏళ్లుగా పేపర్ గణనాథుడి పూజ

Secunderabad: సికింద్రాబాద్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం 15 ఏళ్లుగా పేపర్ గణనాథుడిని పూజిస్తున్న శంభోజీ మహారాజ్ యూత్ అసోసియేషన్. పూరి జగన్నాథ్ వేషధారణలో విగ్రహం ఏర్పాటు.

Srikanth, Secunderabad
Published on: 22 Sept 2026 9:19 PM IST
Secunderabad
X

Secunderabad: పర్యావరణ పరిరక్షణ కోసం 15 ఏళ్లుగా పేపర్ గణనాథుడి పూజ

సికింద్రాబాద్: పర్యావరణ పరిరక్షణ కొరకు గత 15 సంవత్సరాలుగా శంభోజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ నిర్వాకుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పేపర్ గణనాధుని చేస్తూ గణేష్ నవరాత్రులు పూజించి సాంప్రదాయ బద్దంగా భజనలు కీర్తనలతో గణనాథుని సాగనంపుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పేపర్ గణనాధుని పూజిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని పూరి జగన్నాథ్ వేషధారణలో గణనాధుని నిర్మించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించి ముందు తరానికి మార్గదర్శకులుగా ఉండాలని నిర్వాహకులు కోరారు.

ప్రకృతిని కాపాడుతూ సమంత రక్షించుకోనే విధంగా ఉండాలని వారు అన్నారు. కార్యక్రమం అసోసియేషన్ సభ్యులు క్రియేటర్ బై క్రాంతి కుమార్, మహేందర్, తుకారం, దేవదాస్, నాగేష్, బాబురావు, బాలాజీ, ఆనంద్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad