Secunderabad: ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ!

Secunderabad: సికింద్రాబాద్‌లో అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ లక్ష్మణ్ దీన్ని ప్రారంభించారు.

Srikanth, Secunderabad
Published on: 18 Oct 2026 1:11 PM IST
Secunderabad
X

Secunderabad: ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ!

Secunderabad: ప్రధాని మోడీ పిలుపు మేరకు అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు... ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ముఖ్య అతిధి గా హాజరు కాగా, సికింద్రాబాద్ ఒలిపేంటా బ్రిడ్జి నుండి బౌద్ధ నగర్ వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు..

యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిస అవడం వల్ల కలిగే అనర్థాలను వివారిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది.. విదేశీ శక్తులు భారత దేశ అభివృద్ధిని అడ్డుకోవడానికి జెన్ జీ యువతను డ్రగ్స్ వైపు మళ్లిస్తున్నారాని ఎంపీ లక్ష్మణ్ అన్నారు... తెలంగాణ ఈగల్ టీం తో కలిసి ప్రతి ఆదివారం ఈ అవగాహన కార్యక్రమము నిర్వహిస్తున్నామని ఎంపి లక్ష్మణ్ అన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad