Secunderabad: పోలీసుల తీరుపై సీపీకి సుధీర్ రెడ్డి ఫిర్యాదు
Secunderabad: పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారని, ప్రోటోకాల్ ఉల్లంఘనపై మల్కాజ్గిరి సీపీ సుమతికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
Secunderabad: పోలీసుల తీరుపై సీపీకి సుధీర్ రెడ్డి ఫిర్యాదు
సికింద్రాబాద్: పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లలాగా వ్యవహరిస్తున్నారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు.సరూర్ నగర్, చైతన్యపురిలో జరిగిన అధికారిక సమావేశాల్లో ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులే కాంగ్రెస్ నాయకుల్లా, కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
మల్కాజ్గిరి పోలీసు కమిషనర్ బి. సుమతిని కలిసి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఫోటోలు, వీడియోలు చూపిస్తూ ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు.సికింద్రాబాద్ మారేడుపల్లిలోని మల్కాజ్గిరి డీసీపీ కార్యాలయంలో ఉన్న కమిషనర్ సుమతి కార్యాలయంలో కలిసి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల పట్ల పోలీసులు అతి దారుణంగా, దురుసుగా ప్రవర్తిస్తూ దాడులు సైతం చేస్తున్నారని తెలిపినట్లు సుధీర్ రెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా పోలీసులు వారికే సహకరిస్తూ, ప్రోటోకాల్ ఉన్న తమ బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు ఇబ్బందులు కలిగిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని అన్నారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అప్పుడు తమ తడాఖా చూపిస్తామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరించారు.




