Secunderabad: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తిరుమలగిరి వార్డ్ 7 ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Srikanth, Secunderabad
Published on: 17 Nov 2026 9:05 PM IST
Secunderabad
X

Secunderabad: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్

సికింద్రాబాద్: ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి విద్యార్థులకు అనుకూలంగా మారినప్పుడే విద్యార్థులు అధికంగా ప్రభుత్వ స్కూల్లో చదువుకోవడానికి ఉత్సాహం చూపుతారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు..సీఎం రేవంత్ రెడ్డి విద్యా పై ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వ స్కూళ్ల స్థితి గతులు మంచి ఎన్విరాల్మెంట్ కల్పిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు..తిరుమలగిరి వార్డు సెవెన్ ప్రభత్వ పాఠశాల ను ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అక్కడ విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు..టీచర్స్ విద్యార్థులు తీసుకొచ్చిన సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంటనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..స్కూల్ ప్రక్కనే ఉన్న చెత్త వేయడం పై కంటోన్మెంట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కూల్ ప్రహరీ గోడను అనుకొని ప్రయివేటు వ్యక్తులు వాహనాలు పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి ట్రాఫిక్ టైజింగ్ వేకిల్ రప్పించి వాహనాలను తొలగించారు..కంటోన్మెంట్ నియోజకవర్గం లో సుమారు ఐదు వేల మందికి పైగా విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వారికి ఎల్లవేళలా తన అండదండలు ఉంటాయని ఎమ్మెల్యే శ్రీగణేష్ హామీ ఇచ్చారు..

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad