Secunderabad: ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీగణేష్; ప్రతి చిన్నారికి చుక్కలు వేయించాలని పిలుపు.

Srikanth, Secunderabad
Updated on: 22 Nov 2026 6:01 PM IST
Secunderabad
X

Secunderabad: ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి

సికింద్రాబాద్: ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి.. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పిలుపునిచ్చారు. పికెట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 5 ఏళ్ల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.పోలియో రహిత సమాజ నిర్మాణానికి వైద్య సిబ్బంది, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad