Secunderabad: సీఎం బినామీ ఆరోపణలను ఖండించిన మెడికవర్ ఆసుపత్రి వైద్యులు
Secunderabad: సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్యుల ప్రెస్ మీట్. సీఎం బినామీ ఆరోపణలు తీవ్రంగా ఖండన. ఆరోపణలు చేసిన నేతపై క్రిమినల్ డిఫమేషన్ కేసులు వేస్తామని హెచ్చరిక.
Secunderabad: సీఎం బినామీ ఆరోపణలను ఖండించిన మెడికవర్ ఆసుపత్రి వైద్యులు
సికింద్రాబాద్: మెడికవర్ ఆసుపత్రి వైద్యులు సమావేశం నిర్వహించారు. తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. తమ ఆసుపత్రి సీఎం బినామీ అని ఒక రాజకీయ నేత కావాలనే ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. తాము సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 2011లోనే ఆసుపత్రిని ప్రారంభించామని, 2015 నుంచి 2017 వరకు కొందరు షేర్స్‌లో ఇన్వెస్ట్ చేశారని తెలిపారు.
2017లో మెడికవర్ ఏబి అనే సంస్థ ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించి 66 శాతం వరకు షేర్స్ కొనుగోలు చేసిందని చెప్పారు. తమ డాక్టర్లకు, మెడికవర్ ఏబి సంస్థకు తప్ప తమ ఆసుపత్రిలో మరెవరికీ షేర్ లేదని స్పష్టం చేశారు. తన భార్య ఎవరికీ తెలియదని, అలాంటిది ఫోటోలు వేసి సీఎంకి రిలేటివ్ అని చెప్పడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు తమకు ఎప్పుడూ మంచి, చెడు రెండూ చేయలేదని, తమపై వ్యక్తిగత నిందలు వేసి ఆయనకు వచ్చిందేమిటని ప్రశ్నించారు. తాము ఇప్పటికే సివిల్ డిఫెమేషన్ కేసు వేశామని, క్రిమినల్ డిఫెమేషన్ కూడా ఫైల్ చేస్తామని హెచ్చరించారు. అలాగే పోలీసు ఉన్నతాధికారి డీజీపీని కలిసి వినతి పత్రం అందజేసి కేసును సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతామని తెలిపారు.




